పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని A. K. T. P. M. స్కూల్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కేంద్రంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులు ఎవరు కూడా పోలియో బారిన పడకూడదనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలను వేయించడం వల్ల వివిధ వ్యాధులు దరిచేరకుండా చేయవచ్చన్నారు. 2011 తర్వాత దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని.. 2012 లో మన దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడిందని చెప్పారు. కనుక ప్రజల సహకారం లేకపోతే కార్యక్రమం విజయవంతం కాదని.. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలను వేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, డాక్టర్ రమేష్, నాయకులు దొనేపూడి శ్రీనివాస్, ఒగ్గు విక్కీ, వైద్య అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *