తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 32369 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 87 జనరల్, 14 వొకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ పేపర్-1 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జనరల్ 31,974 మంది, ఒకేషనల్లో 1,506 మంది మొత్తం 33,480 మంది విద్యా ర్థులు హాజరవ్వాల్సి ఉండగా జనరల్లో 716, ఒకేషనల్లో 125 మంది, మొత్తం 843 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. డెఫ్ అండ్ డంబ్ విద్యార్థులు సహాయకుల సహకారంతో పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన
-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …
Prajavartha Online Telugu News