ఓటర్ల జాబితా పై అందే క్లైమ్స్ పెండింగ్ ఉండడానికి వీలులేధు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా పై అందే క్లైమ్స్ పెండింగ్ ఉండడానికి వీలులేదని, ఎప్పటికప్పుడు పరిష్కారం చేయని బిఎల్ఓలు, సూపర్వైజరి అధికారులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి ఆదేశించారు. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాపై అందిన ఫిర్యాదులు, అర్జీల పరిష్కారంపై ఏఈఆర్ఓలు, సూపరిండెంట్లతో బుధవారం కమిషనర్ చాంబర్ లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజికవర్గాల్లో ఓటర్ల జాబితా పై అందే ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయాలని, బిఎల్ఓల వారిగా గడువు అనంతరం పెండింగ్ ఉన్నవారి వివరాలతో నివేదిక ఇవ్వాలన్నారు. సూపర్వైజరి అధికారులు బిఎల్ఓల వారిగా అందిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇతర నియోజకవర్గాల అర్జీలు ఆన్ లైన్ ద్వారా అందితే సంబందిత నియోజకవర్గ అధికారులతో సమన్వయం చేసుకొని ఆర్జీల పరిష్కారంకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఏఈఆర్ఓలు సిహెచ్.శ్రీనివాస్, వెంకట లక్ష్మీ, ప్రదీప్ కుమార్, శ్రీనివాస్, నిరంజన్ సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *