జనపనార ఉత్పత్తుల తయారీ మరియు స్క్రీన్ ప్రింటింగ్ పై గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ

-29-02-2024 నుంచి 06-03-2024 వరకు జరిగిన శిక్షణా కార్యక్రమం

బొమ్మూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం , తూర్పు గోదావరీ జిల్లా ఆత్మ వారీ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమంలో యువ ఔత్సాహిక రైతులు పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో 15 మంది గ్రామీణ మహిళలు రాజానగరం, రాజమండ్రి, నరేంద్రపురం, కలవచర్ల, కోరుకొండ, కృష్ణపట్నం, గాదరాడ గ్రామాల నుండి ఎంపిక కాబడిన యువ ఔత్సాహిక రైతులు పాల్గొనడం జరిగింది. వారం రోజులపాటు నిర్వహింప బడిన ఈ శిక్షణా కార్యక్రమంలో జనపనారతో చేసిన బ్యాగులు, టిఫిన్ మరియు లంచ్ బ్యాగులు, సెల్ఫోన్ బ్యాగులు, ఆఫీస్ ఫైల్స్ తో పాటు, రెండు రోజులపాటు స్క్రీన్ ప్రింటింగ్ మీద శిక్షణను నిర్వహించామని కే వి కే హేడ్ డా. వి ఎస్ జి ఆర్ నాయుడు పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో జనపనార ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ దృష్ట్యా వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తులను తయారు చేయాలని, కెవికె ఈ దిశగా మహిళలను ఉత్సాహపరిచేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం చివరి రోజుగా బొమ్మూరులో శ్రీమతి పి. అమరావతి గారి పర్యవేక్షణలో గ్రామీణ మహిళలకు చీరలపై స్క్రీన్ ప్రింటింగ్ పద్ధతి పై శిక్షణ, సందర్శన ఏర్పాటు చేయడ మైనది. మాస్టర్ ట్రైనర్ గా వ్యవహరించిన పి. అమరావతి మహిళలకు అనేక రకాల డిజైన్లలో గోల్డ్ మరియు సిల్వర్ ప్రింటింగ్ పద్ధతి పై శిక్షణను కల్పించారు. జనపనార బ్యాగులపై స్క్రీన్ ప్రింటింగ్ ను ఏ విధంగా చేపట్టాలో ప్రదర్శనగా చూపించారు. ప్రాజెక్టు డైరెక్టర్, ఆత్మ తూర్పుగోదావరి  వై . జ్యోతిర్మయి, మాట్లాడుతూ ప్రతి మహిళ స్వయం సాధికారత దిశగా అడుగులు వేయాలని, ఈ శిక్షణా కార్యక్రమం గ్రామీణ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని, జనపనార ఉత్పత్తులు స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని తెలియజేశారు. మాస్టర్ ట్రైనర్ పి. అమరావతి మాట్లాడుతూ ప్రథమంగా కేవీకే కలవచర్లలో శిక్షణను తీసుకొని, మహిళా ప్రాంగణంలో చాలా సంవత్సరాల పాటు విధులు నిర్వహిస్తూ, టైలరింగ్ లో లోయర్, హయ్యర్ మరియు టిటిసి విద్యలను అభ్యసించి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కు, కాపు సంఘాలకు తన సేవలను అందిస్తూ స్వయంగా ‘అమరావతి’ పేరుతో ఎంబ్రాయిడరీ టైలరింగ్ బోటిక్ ను బొమ్మూరు లోనే ఏర్పాటు చేసుకుని, కాటన్ చీరలపై వివిధ రకాల డిజైన్లను, విలువ జోడిస్తూ ఆర్థికంగా పురోభివృద్ధిని సాధిస్తూ ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నానని తెలిపారు. కెవికె వారు ఇచ్చిన సహకారంతోనే స్వయంగా వృత్తి నైపుణ్యతను సంపాదించుకొని మాస్టర్ ట్రైనర్ గా ఎదిగానని తెలిపారు. ప్రతి దినము సరాసరి రూ.2,500 నుండి 3 వేల వరకు సంపాదించుకోగలనని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీమతి వై. జ్యోతిర్మయి, డా. వి ఎస్ జి ఆర్ నాయుడు, సత్యవాణి తదితరులు జనపనార ఉత్పత్తుల తయారీ మరియు స్క్రీన్ ప్రింటింగ్ లో శిక్షణ పొందిన 15 మంది గ్రామీణ మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. కెవికె వారు భవిష్యత్తులో మరిన్ని నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని గ్రామీణ యువత కోరారు. ప్రాజెక్టు డైరెక్టర్, ఆత్మ తూర్పుగోదావరి శ్రీమతి వై. జ్యోతిర్మయి, ఉద్యాన పంటల అధికారి జేవియర్ సత్యవాణి , విశ్రాంత చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఆర్. సుధాకర్, కెవికె స్టాఫ్ విజయవర్ధన్, జక్కంపూడి ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణను నిర్వహించేందుకు సిటిఆర్ఐ డైరెక్టర్ డా. మాగంటి శేషు మాధవ్ , కెవికె మరియు ఆత్మ తూర్పుగోదావరి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *