విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు సాయంత్రం గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ” కార్యక్రమం ద్వారా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్, రాణిగారితోట అంథోని స్ట్రీట్ ప్రాంతాలలో దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మహాన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అందుకున్న సంక్షేమం,జరిగిన అభివృద్ధి చూసి రాబోయే ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ మరియు వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ సమక్షంలో వైసీపీలోకి చేరికలు 18వ డివిజన్ రాణిగారితోటకి చెందిన మహిళలు దేవినేని అవినాష్ సమక్షంలో 10 కుటుంబాలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి చేరిన వారికి అవినాష్ వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ లో సముచితమైన స్థానం ఉంటుందని తెలిపారు.
Prajavartha Online Telugu News