సెలవు రోజుల్లోను పనిచేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు…కమిషనర్ కీర్తి చేకూరి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 3 వారాలు మాత్రమే ఉన్నందున పన్ను చెల్లింపుదార్లకు వీలుగా సెలవు రోజుల్లోనూ క్యాష్ కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయని పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ లో వార్డ్ సచివాలయం వారీగా పన్ను బకాయిలు, మొండి బకాయిదార్ల వివరాలపై నగర కమీషనర్ కీర్తి చేకూరి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల పన్నులు పూర్తిగా చెల్లించి వడ్డీ రాయితిని పొందాలని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి పన్ను పై వడ్డీ యధావిధిగా ఉంటుందన్నారు. పన్నుపై వడ్డీ రాయితీ పొందేందుకు 3 వారాలే గడువు ఉన్నందున సెలవు రోజులైన శుక్ర, శని,ఆదివారాల్లోను జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటుగా, భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లోని క్యాష్ కౌంటర్లు యధావిదిగా పనిచేస్తాయన్నారు. కావున నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అడ్మిన్ కార్యదర్శులు పన్ను బకాయిదార్లల వివరాలను మొండి, సాదారణ లిస్టుగా వేరు చేయాలన్నారు. బకాయిదార్లకు వాలంటీర్ల సహకారంతో ప్రభుత్వం కల్పించిన వడ్డీ రాయితీపై అవగాహన కల్గించాలన్నారు. మొండి బకాయిదార్లకు రెడ్ నోటీసులు జారీకి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *