పవిత్ర రంజాన్ మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలి…

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం తరపున చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వివిధ మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల నెలవంక కనిపించినప్పటి నుండి పవిత్ర రంజాన్ మాసం మొదలవుతుందని వచ్చే నెలలో నెలవంక మరలా కనిపించినప్పుడు రంజాన్ పండుగ జరుపుకుంటారన్నారు. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు చాలా ముఖ్యమైనదని, ఎంతో నిష్టతో ఏకాగ్రతతో ఉపవాసాలు ఉంటారని, వారి భావోద్వేగాలకు ఎలాంటి భంగం వాటిల్ల కుండా జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకారం అందిస్తుందన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మసీదు వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రెండు రోజుల్లో జిల్లాలోని మసీదులన్నిటిని స్థానిక అధికారులు సందర్శించి అక్కడ ముస్లిం సోదరులకు కావలసిన సౌకర్యాలు ఏమిటో తెలుసుకుని వాటిని సమకూర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా మసీదు వద్ద ప్రతిరోజు పారిశుధ్యం సజావుగా తప్పనిసరిగా చేపట్టాలన్నారు. అలాగే మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు నమాజ్ వేళల్లో విద్యుత్ సరఫరాకు ఎలాటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మసీదు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షంసున్నిసా, ఆర్డిఓ ఎం వాణి, డి.ఎస్.పి సుభాన్, డీఎస్ఓ పార్వతి విద్యుత్ శాఖ ఈఈ భాస్కర్ రావు డిఆర్డిఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సిలార్ దాదా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చెబా పలువురు మసీదు కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *