పసుపుమయం గా మారిన కేతనకోండ గ్రామం

ఇబ్రహీంపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో శుక్రవారం సాయంత్రం మైలవరం తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ గ్రామంలోని పలు వీదుల్లో ప్రచారం నిర్వహించారు. మహిళలు హరతులు పట్టి అశీర్వదించగా యువత ర్యాలీగా ముందుండి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామం లోని పలు దేవాలయాల్లో గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించారు. ఆయన వెంట మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) స్థానిక నాయకులు, మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్దానిక జనసేన, బిజెపి, తెలుగుదేశం నాయకులతో కలిసి గ్రామం లోని ప్రధాన వీధుల్లో పాదయాత్ర చేస్తూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముందుకు సాగారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *