-కేసలి అప్పారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో పసి పిల్లలును విక్రయించినా,అనధికారికంగా దత్తత స్వీకరించినా అటువంటి వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక నెల నుండి ఒక సం .లోపు కొంతమంది శిశువులును వివిధ ప్రాంతాల నుండి అక్రమంగా సేకరించి సంతానం కలగలేని దంపతులను లక్ష్యంగా చేసుకుని దేశంలోని ప్రధాన నగరాల కేంద్రాలుగా పసి పిల్లలును కొన్ని లక్షలకు విక్రయిస్తున్న కొంతమంది అంతరాష్ట్ర మధ్యవర్తుల ముఠాను పోలీసు అధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది.రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 16 మంది శిశువులు గుర్తించి హైద్రాబాద్ లో శిశు సంరక్షణ కేంద్రంలో చేర్పించడం జరిగింది.ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మరియు రాష్ట్ర పోలీస్ అధికార్లు తక్షణమే విచారణ చేపట్టి నివేదికను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .
ప్రముఖ ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి,ఆ బాలల వివరాలు సేకరించడం తో పాటు ఈ బాలల అక్రమ రవాణా రాకెట్ వెనుక ఉన్నవారిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ మరియు, రాష్ట్ర పోలీస్ ఉన్నత అధికారులకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు జారీచేసారు.
ఇటీవల ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు దేశంలో నిర్వహించిన ఒక సర్వేలో బాలల అక్రమ రవాణా ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అనగా ప్రత్యేక నెట్వర్క్స్ , లింక్లు, ఎప్ప్స్,సోషల్ మీడియా లో పసిపిల్లలు ఫొటోస్ పంపించి అడ, మగ పిల్లలకు ప్రత్యేక కోడ్ లను ఉపయోగించి విక్రయాలు సాగిస్తున్నట్టు తెలిపారు.
రాష్టంలో ప్రభుత్వ, ప్రైవేటే ఆసుపత్రిల్లో , ఫెర్టిలిటీ కేంద్రాలు, క్లినిక్ లలో నిరంతరం నిఘా,పర్యవేక్షణ ఉంచాలని, గ్రామ స్థాయిలో అంగన్వాడి , సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చూడాలని రాష్ట్ర అధికారులను బాలల హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే శిశువుల విక్రయాల అంశం పై ఎటువంటి సమాచారం అందినా వెంటనే బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకొని వస్తే వెంటనే సుమోటోగా తీసుకొని వారిపై తగిన శాఖాపరమైన చర్యలు చేపడుతుందన్నారు.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ర్ట స్థాయిలో బాలలు తో పనిచేసే సంబంధిత అధికారులకు, సిబ్బందికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.