-ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐ.టి.ఐ) యందు ఖాళీ పోస్టులు
-కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఎ.టి.ఓ) ఉద్యోగాల భర్తీ
-ఈ ఏడాది మార్చి 20వ తేదీవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
-అడ్మినిస్ట్రేటివ్ కారణాల వలన వ్రాత పరీక్ష వాయిదా
-బండి నవ్య, ఐఏఎస్, ఉపాధి మరియు శిక్షణ శాఖడైరెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉపాధి మరియు శిక్షణ శాఖ నందు, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐ.టి.ఐ) యందు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఎ.టి.ఓ) పోస్టులకు నిర్వహించాల్సి ఉన్న పరీక్షను వాయిదా వేయడం జరిగిందని ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ బండి నవ్య శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎ.టి.ఓ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయుటకు వెబ్‌సైట్ https://employment.ap.gov.in/ద్వారా మార్చి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. అయితే అడ్మినిస్ట్రేటివ్ కారణాల వలన వ్రాత పరీక్ష వాయిదా వేయటం జరిగిందని అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి పూర్తి సమాచారం వెబ్‌సైట్ https://employment.ap.gov.in/ద్వారా తెలియజేయడం జరుగుతుందని అభ్యర్థులు గమనించాలని బండి నవ్య ప్రకటనలో స్పష్టం చేశారు.