-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS
-ఆసక్తి గల ఉపాధ్యాయులు జూన్ 3 లోపు పేర్లు నమోదు చేసుకోవాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, రోటరీ మరియు ఇండియన్ కెరీర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో కెరీర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ‘స్టేట్ రిసోర్సు పర్సన్లు’గా శిక్షణ పొందడానికి ఆసక్తిగల ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేసుకోవాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయులకు విజయవాడలో రెండు రోజుల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ప్రతి తరగతి నుండి ఇద్దరు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు మాత్రమే ఎంపిక చేసి, 50 మందికి శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. శిక్షణానంతరం వారు జిల్లా స్థాయి ఉపాధ్యాయ శిక్షణ, మార్గదర్శకత్వం వహిస్తారని తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, రోటరీ మరియు ఇండియన్ కెరీర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ నుండి గుర్తింపు పొందడానికి ఇది అరుదైన అవకాశమని, మెల్బోర్న్ లేదా రోటరీ నేషన్ బిల్డర్ అవార్డులకు అధ్యయన పర్యటనలకు అవకాశం దక్కించుకోవచ్చని, వేలాది మంది యువకుల భవిష్యత్తు విజయాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయులుగా కీలక పాత్ర పోషించేందుకు ఆసక్తిగలవారు జూన్ 3 సాయంత్రం 5 గంటలలోపు గూగూల్ ఫాంలో https://docs.google.com/forms/d/e/1FAIpQLSdM6jB1CllnhrJKCVV5m2BNFxVuckXMYa2OsA1Il-mr7bK55A/viewform నమోదు చేసుకోవాలని కోరారు.