విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
10వ అంతర్జాతీయ యోగా డే సందర్భం గా జరుగుతున్న 21రోజుల అవగాహన-చికిత్స-శిక్షణ కార్యక్రమాలను శనివారం అశోక్ నగర్ ఇండియన్ ఓం లో జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించినట్లు యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భం గా పలువురికి మోకాళ్ళ నొప్పులకు ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ విధానంతో చికిత్స చేసి ఎవరికి వారే చికిత్స చేసుకొనెందుకు పరికరాలను అందచేసినారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు బాలసురేష్, ఆక్యుథెరపిస్ట్ లు వెలగపూడి శ్రీదేవి, అంబటి ప్రవల్లిక, అశ్రపున్నీష మరియు యోగ శక్తి సాధన సమితి కార్యదర్శి కొండవీటి సుమతి పాల్గొని సేవలు అందించారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …