Breaking News

కౌంటింగ్‌ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్‌ పూర్తి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 4వ తేదీన చేపట్టే ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, ఎస్‌. డిల్లీరావు తెలిపారు. కలెక్టరేట్‌ ఛాంబర్‌లో ఆదివారం ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ర్యాండమైజేషన్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు నియోజవర్గాల లెక్కింపు పరిశీలకులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ ఢిల్లీ రావు మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు 301మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 402మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు, 308మంది మైక్రో అబ్జర్వర్లు మొత్తంగా 1,011 మంది కౌంటింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ను పారదర్శకంగా ఎన్‌ఐసీ ఆన్‌లైన్‌లో పూర్తిచేశామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.

ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో ఓట్ల లెక్కింపు ప‌రిశీల‌కులు అనిల్ బంకా (విజ‌య‌వాడ తూర్పు),
గౌరీష్ ఎస్‌. కుర్తిక‌ర్ (నందిగామ‌),
అభిషేక్ ధావ‌న్ (విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌), మంజూ రాజ్‌పాల్, (తిరువూరు, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌),
న‌రీంద‌ర్ సింగ్ బాలి (మైల‌వ‌రం),
బీఆర్ సాగ‌ర్ (జ‌గ్గ‌య్య‌పేట‌),
జాయింట్‌ కలెక్టర్‌, మైలవరం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి డా. పి. సంపత్‌ కుమార్‌, డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, ఎన్‌ఐసి డిఐఓ రేవతి, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ యం. దుర్గా ప్రసాద్‌, ఇ`డిస్టిక్ట్‌ మేనేజర్‌ సిహెచ్‌. గోపి సుధాకర్‌ ఉన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *