విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గన్నే వెంకటనారాయణ ప్రసాద్ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. గన్నే వెంకటనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ రేపు నాలుగో తారీఖు ప్రజలందరూ ఆశీర్వాదంతో పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలబోతున్నారు. సుజన చౌదరి. ఈ పశ్చిమ నియోజకవర్గానికి పేద ప్రజలు ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని 100% అభివృద్ధి చేసి చూపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, సుఖాసి సరిత, బొర్రా భాను శ్రీరామ్, చరణ్, అఖిల్, కాకొల్లు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …