ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, ఐ.ఏ.ఎస్ ఆదివారం శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.
Tags indrakiladri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …