Breaking News

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా బందోబస్త్ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపధ్యంలో బందోబస్త్ విధులు నిర్వహించు అధికారులకు మరియు సిబ్బందికి సోమవారం ఇబ్రహీంప‌ట్నం మండ‌లం పరిదిలోని సి.ఏ. కన్వెక్షన్ హాలు నందు పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్., కౌంటింగ్ బందోబస్త్ విధులపై పలు మార్గదర్శకాలు, సూచనలు మరియు సలహాలను అందించి దిశానిర్ధేశం చేయడం జరిగింది.

ఇబ్రహీంప‌ట్నం మండ‌లం, జూపూడిలోని నోవా కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీ, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాల‌జీ నందు ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ను అత్యంత పార‌ద‌ర్శకంగా, జ‌వాబుదారీత‌నంతో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఈసీఐ మార్గద‌ర్శకాల‌కు అనుగుణంగా ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించు ఆయా కళాశాలల పరిసర ప్రాంతాలలో నిరంత‌ర సీసీ కెమెరాల నిఘా, ప్రత్యేక సాయుధ బ‌లగాల ప‌హారా, బ్యారికేడింగ్‌ ఏర్పాట్లు చేయ‌డం, కౌంటింగ్ కేంద్రం మరియు పరిసర ప్రాంతాలలో సుమారు 3000 మందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్., మాట్లాడుతూ…… పాస్ లు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాలలోనికి అనుమతించాలని, కౌంటింగ్ కేంద్రాలలోని వచ్చే వారిని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, మద్యం సేవించిన వారిని లోనికి అనుమతించకూడదని, మొబైల్ ఫోన్స్, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను, సిగరెట్లను మరియు ఇతర మండే వస్తువులను కౌంటింగ్ కేంద్రాలోకి అనుమతించరాదని, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్క్ చేయకుండా చూసుకోవాలని, ఏజెంట్స్ మరియు ఇతరుల వాహనాలను వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో పార్క్ చేసేవిధంగా చూడాలని, ఎన్నికల కోడ్, సెక్షన్ 144(2) సి.ఆర్.పి.సి. మరియు సెక్షన్ 30పోలీస్ యాక్ట్ లు అమలులో ఉన్నందున ఏ ప్రాంతంలో నలుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడి ఉండకుండా చూడాలని, ఎక్కడా అలసత్వం వహించకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని, నిరంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి మానిటరింగ్ చేయడం జరుగుతుందని, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలాగా వ్యవహరించే వారిపై ఎటువంటి ఉదాసీనతలు చూపకుండా అక్కడ నుండి పిక్ అప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ముఖ్యమైన ప్రదేశాలలో పికేట్లలో ఉన్న సిబ్బంది ఆయా ప్రదేశాలలో నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడ కుండా చూసుకుంటూ అప్రమత్తంగా విధులు నిర్వహిచాలని, ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు మరియు విమర్శలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయంతో సమర్ధవంతంగా మరియు పకడ్బందీగా విధులు నిర్వహించాలని తెలియజేశారు.

అనంతరం నోవా కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీని, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ అండ్ టెక్నాల‌జీని కళాశాలల పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు మరియు సలహాలను అందించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తోపాటు డి.సి.పి. లు టి.హరికృష్ణ, టి.చక్రవర్తి, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *