విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి గెలుపు మాదిగల గెలుపు అని మాదిగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు పేరు పోగు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి విజయం పై మాదిగ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాది గ నేతలుకేక్ కటింగ్ చేసి, అనంతరం జేఏసీ అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు గెలుపే మాదిగ గెలుపు అని రాష్ట్రంలో ఉన్న మాదిగలు అందరూ కూటమి గెలుపుకి కష్టపడి పని చేశారని అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల కల సహకారం చేసే దిశగా చంద్రబాబు నాయకత్వంలో కూటమి అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలని అదేవిధంగా వైయస్ జగన్ పాలనలో తీవ్రంగా నష్టపోయిన మాదిగలకు, మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. జూన్ 9 తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి మా 35 మాదిగ సంఘాల తరఫున అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. కార్యక్రమంలో దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెట్టే రాజు, అనుముల వంశీ, నవ్య అధ్యక్షులు వేజెండ్ల సుబ్బారావు, వనం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …