-విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు కళాశాల విద్య ఎంతో దోహదపడుతుంది.
-వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ జి. కరుణాసాగర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు కళాశాల విద్య ఎంతో దోహదపడుతుందని వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ జి. కరుణాసాగర్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం(కాతేరు) వ్యవసాయకళాశాల నందు వ్యవసాయ కళాశాల 16వ వార్షికోత్సవ కార్యక్రమం వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ జి. కరుణాసాగర్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలనతో ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ జి. కరుణాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమ శిక్షణతో విద్యను అభ్యశించడం వలన తమ ఉజ్వల భవిష్యత్తుకు కళాశాల విద్య ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ఆంధ్రా పేపర్ మిల్లు డీజీయం ఫామ్ ఫారస్ట్రీ డా. బి. సురేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమలోని నిబిడీకృతమైన విద్యను అభ్యశించడం, తమలోని ప్రతిభా నైపుణ్యాలు ద్వారా భవిష్యత్తు ప్రణాళికకు చక్కని రూపకల్పన చేసుకోవడం ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చునని పెర్కొన్నారు.
ఈ సందర్బంగా రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల ఫ్రిన్సిపాల్ కళాశాల ప్రగతిని వివరించారు. మార్టేరు వ్యవసాయ సంయుక్త పరిశోధన సహాయ సంచాలకులు డా. డి. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే తమ బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకొనేందుకు కళాశాల విద్య ఎంతోఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఓఎమ్ డా.పిఎల్. ఆర్ జె ప్రవీణ్ మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల నందు గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు విద్యార్థిని విద్యార్థుల పురోగతిని, సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యాసంబంధమైన ప్రగతిని గురించి వివరించారు. డా.పి. మునిరత్నం క్రంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాట్లాడుతూ విద్యార్థిని విధ్యార్థులు క్రమశిక్షణ. కలిగి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు. ఈ కార్య క్రమానికి విచ్చేసిన అధికారులను ప్రోఫెసర్ హెడ్ ఆఫ్ జెనిటిక్స్ డా. ఎస్.వి. భవాని ప్రసాద్ పుష్పగుచ్చాలను అందించి సాదరంగా వేదిక మీదికి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విధ్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా వివిధ డిపార్టమెంట్స్ లో అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్థిని విధ్యార్థులకు గోల్డ్ మెడల్స్ బహుకరించడం జరిగింది. అసిస్టెంట్ ప్రోఫీసర్ డా. సిహెచ్. సునీత వందన సమర్పణ చేయగా, విధ్యార్థిని విధ్యార్థులు ప్రదర్శించన నృత్య ప్రదర్శనలు,గేయాలు కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులను ఎంతోగానో అలరించాయి.