విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్షరం కాలాన్ని శాసిస్తే తట్టుకోలేని కాలం కాటు వేసింది…రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది అని విష్ణువర్జల అనంతరామ కృష్ణ ప్రసాద్ (అమ్మ ప్రసాద్) తెలిపారు. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. తెలుగుజాతి గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారు. రామోజీరావు వ్యక్తి కాదు…వ్యవస్థ అని అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …