Breaking News

ఫిర్యాదులు 48 గంటల్లో పరిష్కారం చేయడానికి కార్యాచరణ సిద్దం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వీధి దీపాలు అన్నీవెలిగేలా చర్యలు తీసుకోవాలని, వీధి దీపాలకు సంబదించి ప్రజల నుండే అందే ఫిర్యాదులు 48 గంటల్లో పరిష్కారం చేయడానికి ఇంజినీరింగ్ అధికారులు కార్యాచరణ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ చాంబర్ లో నగరంలో వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడికతీత పనులు తదితర అంశాలపై ఎస్.ఈ., ఈ.ఈ లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల వారీగా ప్రతి వీధిలోని వీధి దీపాలు తప్పనిసరిగా వెలిగేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీధి దీపాల సమస్యల పై ప్రజల నుండి అందే ఫిర్యాదులను 48 గంటలలోగా పరిష్కారం చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. వీధి దీపాల మరమత్తులు, అవసరమైన మెటీరియల్ కోసం ప్రతిపాదనలను సిద్దం చేసి, ఎస్.ఈ. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తమకు పంపాలన్నారు. జిఎంసి ప్రధాన కార్యాలయంలోని కంప్లైంట్ సెల్ కి అందే ఫిర్యాదులు, వాటి వివరాలను ప్రతి రోజు తమకు నివేదిక ఇవ్వాలన్నారు. నగరంలో ప్రతి రిజర్వాయర్ నిర్దేశిత షెడ్యుల్ మేరకు శుభ్రం చేయాలని, త్రాగునీటి సరఫరాలో కలుషిత నీటి సరఫరాపై అందే ఫిర్యాదుల పట్ల తక్షణ స్పందన ఉండాలన్నారు. ఏఈల వారీగా ఎమినిటి కార్యదర్శులు త్రాగునీటి సరఫరా సమయాల్లో శ్యాంపిల్స్ తీసి గ్రూప్ లో పోస్ట్ చేయాలన్నారు. ప్రస్తుతం వర్షాల సీజన్ ప్రారంభం అయినందున వర్షం నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా ఏఈలు పర్యవేక్షణ చేయాలన్నారు. నగరంలోని ప్రధాన ఔట్ ఫాల్ డ్రైన్ల జరుగుతున్న పూడికతీత పనులను ఈఈ లు నేరుగా పరిశీలించాలన్నారు. పూడిక సంపూర్ణంగా తీయక పొతే రానున్న వర్షాలకు డ్రైన్ లు పొంగి సమస్యలు వస్తాయన్నారు. పూడిక తీస్తున్న ప్రాంతాల్లో ముందు, తర్వాత ఫొటోలు గ్రూప్ లో పోస్ట్ చేయాలన్నారు. పూడిక తీసే ప్రాంతాల్లో ఏమైనా ఆక్రమణలు ఉంటే పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్.ఈ. శ్యామ్ సుందర్, ఈఈలు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *