తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల జూన్13 నుండి 15 వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నాబార్డ్ ఆం.ప్ర ప్రాంతీయ కార్యాలయం వారి ఆధ్వర్యంలో FPO మేళా – తరంగ్ కార్యక్రమాన్ని స్మాల్ ఫార్మర్స్ అగ్రి – బిజినెస్ కన్సార్టియం (SFAC) మరియు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వారి భాగస్వామ్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు నాబార్డ్ డిడి సునీల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేళా నందు గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు మరియు రైతులచే సేంద్రీయ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేసిన కూరగాయలు, పండ్లు, మినుములు, తేనె,బెల్లం, మొదలైన సేంద్రియ ఉత్పత్తులను 50 స్టాల్స్ ఏర్పాటు ఉంటాయని మరియు చేనేతల కలంకారీ చీరలు మరియు ఉత్పత్తులు, చెక్కతో చేసిన విగ్రహాలు, కుండలు మొదలైన చేనేత ఉత్పత్తులను ప్రదర్శింప బడుతాయని తద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు, కళాకారులకు ప్రోత్సహించడం , వారి ఆదాయ మార్గాలు పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఈ మేళా జూన్ 13 న ప్రారంభమై 15 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తిరుపతి ప్రజలు మరియు వినియోగదారులు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని, మేళా దినాలలో ప్రతి రోజూ సాయంత్రం 5 గం. నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నాబార్డ్ డిడి ఆ ప్రకటనలో తెలిపారు.