అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడు హిందూపురం ఎమ్మెల్యే, పేదల పెన్నిది, సేవాతత్పర హృదయుడు నటరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేక్ ను కట్ చేసి ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సినీ నిర్మాత, దక్షిణ భారత నిర్మాతల సంఘ అధ్యక్షుడు కాట్ర గడ్డ ప్రసాద్ కు తినిపించారు. స్వీట్లు పంచి పెట్టారు. బాలకృష్ణ సేవలను కొనియాడారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా హిందూపురం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమాజ హితమైన సినిమాలతో బాలకృష్ణ మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. బాలకృష్ణ సేవలు చిరస్థాయి కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి పాల్గొని బాలకృష్ణ జన్మదిన వేడుకలను పంచుకున్నారు. బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ.. కాపు మల్లికార్జున యాదవ్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని బాలయ్య జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బాలయ్య జన్మదినవేడుకల కేక్ కటింగ్ తో టీడీపీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.
Tags amaravathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …