Breaking News

జిల్లా వ్యాప్తంగా అన్ని ఒక పండుగ వాతావరణంలో రెండు రోజుల పాటు లైటింగ్ ఏర్పాట్లు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 12 న నూతన ప్రభుత్వం ఏర్పాటు సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని ఒక పండుగ వాతావరణంలో రెండు రోజుల పాటు లైటింగ్ ఏర్పాట్లు చురుగ్గా ఏర్పాటు చెయ్యడం జరిగిందని, అదే విధంగా జిల్లా నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న వారి కోసం తగిన ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలలో పాల్గొనే ప్రముఖులకు వి ఐ పి పాసులు జారీ చెయ్యడం జరిగిందని, సంబంధిత శాసన సభ్యుల ద్వారా వాటిని అందచెయ్యాల్సి ఉంటుందన్నారు. దేశ ప్రధాని ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలియ చేశారు. ఆమేరకు జిల్లా నుంచి వెళ్లే వ్యక్తులు ముందుగా సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో, మండల హెడ్ క్వార్టర్స్ లో నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమం 29 ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కోసం తగిన ఏర్పాట్లు చెయ్యడం జరుగుతున్నట్లు మాధవీలత తెలియ చేశారు. సంబంధిత ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు కోసం తగిన ముందస్తు చర్యలు ఈరోజు రాత్రికే పూర్తి చేయాలన్నారు.

కలెక్టరేట్, ఆర్ ఎం సి, ఆర్డీవో, పశు సంవర్థక శాఖ కార్యాలయాల్లో, కలెక్టర్ క్యాంపు కార్యాలయం, జిల్లా విద్యా అధికారి కార్యాలయం, ఆర్ట్స్ కళాశాల, నన్నయ్య యూనివర్సిటీ, గంధం గనిరాజు సెంటర్, వై జంక్షన్, లాలా చెరువు తదితర ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని అధికారులు వివరించారు. జూన్ 11. 12 తేదీల్లో ఆయా కార్యాలయాల్లో, ముఖ్య కూడళ్లలో విద్యుత్ కాంతులు వెదజల్లే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో కలెక్టర్ ఛాంబర్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, డివిజనల్ అభివృద్ది అధికారులు పి. వీణా దేవి, వి. శాంత మణి , హౌసింగ్ డి ఈ జి..పరశురామ్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *