రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రి వర్గ సభ్యులు బుధవారం చేపట్టనున్న పదవీ స్వీకార కార్యక్రమాన్ని రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారం కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. ఇందుకోసం జిల్లాలో 29 ప్రదేశాల్లో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా తిలకించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు వేదికలు .. మునిసిపల్ / మండలం వారీగా….
** అనపర్తి – కళావేదిక, అనపర్తి
** బిక్కవోలు – కాపుల కల్యాణ మండపం, మార్కెట్ దగ్గర
** రంగంపేట – శ్రీ కాకతీయ కమ్మ కళ్యాణ మండపం, వడిసలేరు
** దేవరపల్లి – ఆర్య వైశ్య కల్యాణం మండపం, బస్టాండ్ దగ్గర
** గోపాలపురం – ఆర్య వైశ్య కల్యాణమండపం
** నల్లజర్ల – ఎంపిడిఓ కార్యాలయం
** గోకవరం – ఆదర్శ ఫార్మసీ కాలేజీ కొత్తపల్లి
** కొవ్వూరు అర్బన్ – యువరాజ్ ఫంక్షన్ హాల్
** కొవ్వూరు – ఎంపిడిఓ కార్యాలయం
** తాళ్లపూడి – తాళ్లపూడి గ్రామ పంచాయతీ
** చాగల్లు – సుబ్రహ్మణ్యేశ్వర ఆడిటోరియం, ఆంజనేయ స్వామి గుడి వెనుక వైపు
** నిడదవోలు రూరల్ – గీతా మందిరం, సమిశ్రగూడెం
** నిడదవోలే అర్బన్ – రోటరీ ఫంక్షన్ హాల్
** ఉండ్రాజవరం – శివాలయం సెంటర్
** పెరవలి – ఎంపిడిఓ కార్యాలయం
** కడియం – దేవి సెంటర్, కడియం
** రాజమహేంద్రవరం రూరల్ – నరసింహరాజు కళ్యాణ మండపం, బొమ్మూరు
** కోరుకొండ – మండల ప్రజా పరిషత్,
** రాజానగరం – మండల ప్రజా పరిషత్,
** సీతానగరం – జి వి కె కన్వెన్షన్ హాల్
** రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో – ఆనం కళా కేంద్రం, సుబ్రహ్మణ్య మైదానం , రామాలయం సెంటర్ , ఏ వి ఎ రోడ్డు, పుష్కర్ ఘాట్ , ఎమ్ ఎస్ ఆర్ హై-టెక్ బస్ షెల్టర్ , ఏ సీ గార్డెన్స్ మునిసిపల్ కళ్యాణ మండపం ,b మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం , క్వారీ పేట సెంటర్ , రౌతు తాతలు కళ్యాణ మండపం.