Breaking News

గన్నవరం చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

-ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి గన్నవరం చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం ఉదయం 10:55 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి టిడిపి అధినేతతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, బిజెపి నాయకులు సోము వీర్రాజు, బీజేపీ స్టేట్ మీడియా ఇన్చార్జ్ పాటూరి నాగభూషణం, బిజెపి జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజాబాబు, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుమార్ స్వామి, జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇంచార్జ్ వినూత కోటా, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ దారం అనిత, జనసేన పార్టీ అధికార ప్రతినిధులు పి. గౌతమ్ రాజ్, శ్రీకాంత్, టిడిపి పొలిటికల్ సెక్రటరీ టీడీ జనార్దన్ రావు, టీడీపి మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *