తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని నేటి గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం 7:30 గంటలకు శ్రీ గాయత్రి నిలయం అతిథి గృహం నుండి ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయం ముఖద్వారం చేరుకోగా టిటిడి జె ఈ ఓ వీరబ్రహ్మం ఆలయ అర్చకులు ఇస్తకఫాల్ స్వాగతం పలకగా ముఖ్యమంత్రి ముందుగా ధ్వజస్తంభంకు మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం నందు ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు శ్రీవారి ప్రతిమను ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల ముఖ్యమంత్రిని చూడడానికి అశేషమైన ప్రజలు ఒక్కసారిగా సీఎం అని పిలవగా వెంటనే స్పందించి నేరుగా ప్రజలకు అభివాదం చేస్తూ బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పెద్ద జీయర్ స్వామి మఠమునకు వెళ్లి ఆశీర్వచనం తీసుకొని, శ్రీ బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అఖండ దీపం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కరికాల వలనన్, డిఐజీ షిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, తిరుపతి ఎస్పి హర్ష వర్ధన్ రాజు, టీటీడీ జే ఈ ఓ గౌతమి, టి టి డి సివిఎస్వో నరసింహ కిషోర్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు ప్రసాదరావు,ఎమ్మెల్యేలు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, పూతలపట్టు శాసన సభ్యులు, ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, కె.ఆదిమూలం, గాలి భాను ప్రకాష్ నాయుడు, కె.మురళీమోహన్, గురజాల జగన్మోహన్ తదితరులు ఉన్నారు.