రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్ట మొదటి సారిగా తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని, శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని రేణిగుంట విమానాశ్రయానికి గురువారం మధ్యాహ్నం 12.22 గం.లకు చేరుకున్న వీరికి సాదర వీడ్కోలు లభించింది. రేణిగుంట విమానాశ్రయం వెలుపల ఉన్న ప్రజలను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం మధ్యాహ్నం 12.36 గం.లకు విజయవాడకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. అనంతపురం రేంజి డిఐజీ షిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, తిరుపతి ఎస్పి హర్ష వర్ధన్ రాజు, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సివి నాయుడు, సుగుణమ్మ, వరప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ తదితరులు గౌ. ముఖ్య మంత్రికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
Tags tirupathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …