విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి ప్రత్యేక హెూదాతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోరాడాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు నేటి గాంధీ ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ శనివారం పవన్ కళ్యాణ్ కు లేఖ వ్రాసారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం హెూదా కావాల్సిందేనని అన్నారు. అలాగే రాష్ట్రంలో మద్యనిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం వలన మహిళలకు తగిన రక్షణ లేకుండా పోతోందని గాంధీనాగరాజన్ ఆవేదన వ్యక్తంచేసారు. క్వాలిటీ మద్యం అందిస్తామంటున్న ప్రభుత్వం పిల్లలకు మంచి బియ్యంతో భోజనం పెట్టాలని కోరారు. నియంతలా పాలించిన జగన్కు ప్రతిపక్ష హెూదా కూడా దక్కకుండా ప్రజలు చేసారని, ఈ విషయాన్ని గుర్తించి చక్కటి పాలనను అందచేయాలని నేటి గాంధీ తాను రాసిన లేఖలో సూచించారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …