విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రజల కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పై ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా భారీ వర్షం పడటంతో వెనువెంటనే సుజనా చౌదరి చరవాణి ద్వారా జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నికల్ దినకరన్ తో మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రంపై ఉందని ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సూచనలతో అధికార యంత్రం నియోజకవర్గ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు , కొండ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు చేపట్టాయి.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …