విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో సెయింట్ జాన్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి సెక్రెటరీ డాక్టర్ కోలా విజయ శేఖర్ ఎంఎస్ వారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగుతాయి. సోమవారం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్య వర్గ సభ్యులతో 2022 ఆగస్టు ఒకటో తేదీన సెంట్ జాన్స్ అంబులెన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖను అమరావతి విజయవాడలో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా విజయవాడ కృష్ణా జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్ అంతట ప్రధమ చికిత్స యొక్క ఈ ప్రాముఖ్యత విశిష్టత, ప్రాణారక్షణ ,విధి విధానాలు, హెుంనర్సింగ్ కోర్స్ నందు రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య విధానము లను కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, అనధికారులు, పోలీస్ యంత్రాంగం, వ్యవసాయ కార్మికులు, వివిధ వృత్తులలో క్లాస్ పనిచేయు వారికి ఆసక్తిగలవారికి విద్యార్థులకు ప్రథమ శిక్షణ నందు శిక్షణ ఇచ్చి ప్రాణాపాయ పరిస్థితుల నుండి ప్రాణాలు రక్షించుటకు తీసుకునే జాగ్రత్తలు, చేయవలసిన చర్యలు వ్యక్తిగత శిక్షణ ద్వారా నేర్పించుచున్నామన్నారు. ఆసక్తి కలవారు శిక్షణ కొరకు ఆల్మైటీ నర్సింగ్ హెూమ్, భవానిపురం, విజయవాడ, ఫోన్ నెంబర్ 9849182140నందు సంప్రదించగలరు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల మంత్రత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ధన్బాద్ వారి నుండి మైన్స్ యందు పనిచేయు వివిధ కార్మికులకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ను ఇచ్చుటకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించిందన్నారు. ఈ కోర్స్ సర్టిఫికెట్ వాల్యూ ఐదు సంవత్సరాలు. ఆసక్తిగలవారు ముఖ్యంగా మైన్స్ లో పనిచేసే వారు ఈ శిక్షణ పొంది శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రం పొందగలరన్నారు. భారత్ సేవక్ సమాజ్, ప్రోమో టెడ్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారిచే పారా మెడికల్ కోర్స్ నందు శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రము ఇవ్వబడుతుందన్నారు.. కనీస విద్యార్హత టెన్త్ ఒకేషనల్ కోర్సు ద్వారా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …