Breaking News

18 ఏళ్లు దాటగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్‌ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఐటీఐ ఒక చక్కటి మార్గంగా ఉంటుంది. విద్యుత్తు, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తాయి. అయితే ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు స్కిల్‌ తప్పని సరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాందించిన విద్యార్థులకు ఉపాధి తప్పని సరిగా లభిస్తుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ, ఐటీఐల్లో స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ కూడా ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితోపాటు స్వయం ఉపాధి సైతం ఐటీఐ కోర్సు ఎంతో దోహదం చేస్తుంది. ప్రభుత్వ బాల, బాలికల ఐటీఐ లలో హాస్టల్‌ వసతి కూడా ఉంది. ఉచిత వసతిలోపాటు భోజనం సౌకర్యం కూడా ఉంది.
ITI సీట్ల కేటాయింపునకు సంబంధించి పదవ తరగతి మార్కులతోపాటు మెరిట్‌, రూల్స్‌ అఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది.

కోర్సుల వివరాలు ఇలా…
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ఏడాది, రెండు సంవత్సరాలకు సంబంధించిన పలు కోర్సులు ఉన్నాయి. ఇందులో రెండు సంవత్సరాలకు సంబంధించి ఎలక్ట్రికల్‌, ఫిట్టర్‌, మోటర్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్‌స్‌మన్‌ సివిల్‌, టర్నర్‌, మిషినిస్టు కోర్సులు ఉన్నాయి. అలాగే ఏడాదికి సంబంధించిన కోర్సుల్లో డ్రస్‌ మేకింగ్‌, కంప్యూటర్‌ కోర్సు(కోప) డీజల్‌ మెకానిక్‌, వెల్డర్‌, కార్పెంటర్‌ కోర్సులు ఉన్నాయి. ఇందులో ఏడాదికి సంబంధించిన డ్రస్‌ మేకింగ్‌ కోర్సు కడప ప్రభుత్వ బాలికల ఐటీఐలో మాత్రమే ఉంది. ఇందులో చేరిన బాలికలకు భోజనంతోపాటు ఉచిత వసతి సౌకర్య ఉంది.

ఉన్నత చదువులకు అవకాశం…
ఐటీఐలో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారు బీటెక్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ విధంగా ఏటా పలువురు లేటరల్‌ ఎంట్రీని పొంది ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *