విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాఖపరంగా ప్రజలకు సేవలందించేందుకు మరెంత చేరువుగా అధికారులు ఉద్యోగులు ఉండాలని రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే ఎం రాంప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక రామవరప్పాడు రింగ్ సమీపంలోని కె హోటల్ నందు మంగళవారం నాడు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా మంత్రి యం. రాంప్రసాద్ రెడ్డి ని కలసి పుష్పగుచుంతో అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించెదానిలో అధికారులు ఉద్యోగులతో కలసి సమన్వయంతో పని చేయాలన్నారు. శాఖాపరంగా ప్రజలు కోరుకున్న సేవలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ముందుండలన్నారు. రవాణాశాఖ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడలన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా ఉన్నతాధికారులతో త్వరలోనే సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు, నా గెలుపునకు ఉద్యోగులు పాత్ర ముఖ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
రాష్ట్ర అధ్యక్షులు ఐ రఘుబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసే దాంట్లో అధికారులు ఉద్యోగులు, సిబ్బంది ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వి ఉమా మహేశ్వరి, సహదక్షులు డి శ్రీనివాస్, కోశాధికారి యం ఆనంద్ కుమార్, జోనల్ అధ్యక్షులు యం. రాజుబాబు, యం శ్రీనివాసరావు, పి లక్ష్మీకర్ రెడ్డి, సంఘ నాయకులు వి రాకేష్ మధుకర్ బాబు,ఇ రమాదేవి, బాలజ్యోతి,టి అనురాధ, కెవివి నాగ మురళి, విహెచ్ పైడిరాజు,ఎ బాలరాజు, ఎన్ నాగశంకర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.