విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్‌లో మంగళవారం అంగన్వాడీ పిలుస్తోంది.. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వి.విజయ ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ, చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించామన్నారు. అంగన్వాడీ కేంద్రంలో అయిదేళ్లు నిండి, పూర్వ ప్రాథమిక విద్య పూర్తయిన పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని కూడా నిర్వహించి, పిల్లలకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో 59వ డివిజన్ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …