Breaking News

రాష్ట్రంలో ఖాళీగా వున్న డి.వై.ఈ.ఓ., ఎం.ఈ.ఓ., పోస్టులను ఇన్చార్జ్ పోస్టులతో కాకుండా శాశ్వత పోస్టులతో భర్తీ చేయాలి

-జిల్లా నగర మండల వారీగా రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల అనుమతులపై నిరంతర పర్యవేక్షణ తనిఖీలు ఉండేలా చర్యలు చేపట్టాలి
-ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న అనధికారిక ప్రైవేట్ పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ తనిఖీలు ఉండేలాగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇన్చార్జి ఎం.ఈ.ఓ., డి.వై.ఈ.ఓ.లతో కాకుండా శాశ్వత ఎం.ఈ.ఓ., డి.వై.ఈ.ఓ. పోస్టులను భర్తీ చేసి విద్యాశాఖ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించే పాఠశాలలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ డిమాండ్ చేసారు.

పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని నిరంతర తనిఖీలు లేకపోవడం వల్లన అనధికారంగా అనేక ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ఇష్టానుసారంగా నియమ నిబంధనలను తుంగలో తొక్కి విద్యాశాఖ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ విద్యార్థులు తల్లిదండ్రుల వద్ద నుంచి అక్రమ పద్ధతిలో అక్రమ అడ్మిషన్లు చేస్తూ వేలాది లక్షల రూపాయలను దోచుకుంటున్నారని..వివిధ నగరాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డివైఈవో), మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) పోస్ట్లను మండలానికి సమీపము గల మండల ఎంఈఓ లతో ఇన్చార్జులుగా నడిపిస్తూ తూ తూ మంత్రంగా కాలం వెళ్లబుచ్చుతున్నారని..ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డివైఈవో, ఎంఈఓ పోస్టులను శాశ్వతంగా భర్తీ చేసి రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలాగా చర్యలు చేపట్టాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ.) ఆంధ్రప్రదేశ్ తరపున డిమాండ్ చేయడమైనదన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *