Breaking News

బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్

-బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ కు దస్త్రంపై తొలి సంతకం
-ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం
-వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి
-త్వరలో బిసి కమీషన్ ఏర్పాటుకు చర్యలు
-రాష్ట్ర బిసి,ఇడబ్ల్యుఎస్,చేనేత జౌళిశాఖల మంత్రి ఎస్.సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకంతో రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమం,ఇడబ్ల్యుఎస్ మరియు చేనేత జౌళి శాఖల మంత్రిగా సంజీవిరెడ్డిగారి సవిత బాధ్యతలు చేపట్టారు.ఈమేరకు గురువారం రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనంలో ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బిసి స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్,ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పధకాలపై మొదటి,ద్వితీయ సంతకాలు చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని,ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశానన్నారు.
అదే విధంగా 2014-19లో 2173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగించ నున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.2014-19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామన్నారు.ఈ ప్రభుత్వంలో చేనేత కళాకారులు,హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు,రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు.బీసీ కులానికి చెందిన మహిళకు వెనకబడిన తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.విభజన నాటికి రాష్ట్రంలో ఉన్న32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను 106 కి పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే అన్నారు.రాష్ట్రం బాగుండాలనే తపన కలిగిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.దేశానికి బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో తనకు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమం మరియు ఇడబ్ల్యుఎస్ సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము,చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత,ఆశాఖ కమిషనర్ ఎమ్.ఎమ్ నాయక్,బీసీ కార్పొరేషన్ ఎండి జి.సి.కిషోర్ కుమార్,బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కృష్ణ మోహన్ మరియు బీసీ సంఘాల నాయకులు,చేనేత కళాకారులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి సవిత ముఖ్య కార్యదర్శి సునీతతో కలిసి మూడవ బ్లాకులోని లేపాక్షి ఎంపోరియంను సందర్శించారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *