విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ భవిష్యత్ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు.
ప్రజలు కోరుకున్న ప్రతి పనిని క్షణాల్లో చేసి చూపించానని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ అన్నారు.. ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు వస్తే పరిష్కారం చేశానని కానీ పని చేయించుకున్న వారిలో ఆ నిజాయితీ తనకు కనపడలేదన్నారు.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓట్లు వేయరని తెలిసిన వారికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చి వారికి అండగా నిలిచామని కానీ ఓటేసేటప్పుడు వారు ఒక్కసారి కూడా ఆలోచించలేదన్నారు.. గుణదల తూర్పు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. తన ఓటమి గురించి కార్యకర్తలు తో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో గెలవాలి అనే లక్ష్యంతో కష్టపడి పని చేశానని నాతోపాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడు ఆయన ధన్యవాదాలు చెప్పారు..కానీ దురదృష్టవశాత్తు ఓడిపోవడం బాధ కలిగించిందన్నారు.. వైయస్ జగన్ సహకారంతో నియోజకవర్గం వ్యాప్తంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచామని గుర్తు చేశారు.. కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రదేశాల్లో అభివృద్ధి పనులు చేసిన ఘనత మనదేనిని అన్నారు.. ఐదు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం చేయకుండా ఇంటికి పరిమితమైన గద్దె రామ్మోహన్ ఏ విధంగా గెలిచాడో అర్థం కావడం లేదన్నారు.. ఇటువంటి ఎన్నికలు ఇప్పటివరకు చూడలేదని రాబోయే కాలంలో కూడా చూడలేమని ఆయన అన్నారు.. ఓటమి చూసి భయపడే వాడిని కాదని తాను ఇప్పుడు ప్రజల్లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.. ఓటమి తో నిరాశ చెందకుండా దేవినేని నెహ్రూ గారి అడుగుజాడల్లో నడుస్తున్నాం.. వైసీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని చెప్పారు.. ఇంకా 40 సంవత్సరాలు రాజకీయం చేసే సత్తా నాలో ఉందని ఎక్కడా వెనక అడిగేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే విధంగా వారిపై ఒత్తిడి తేవాలని అన్నారు..ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,సీనియర్ నాయకులు ముసునూరు సుబ్బరావు,ఆళ్ల చెల్లారావు,సి.ఎచ్ వెంకటేశ్వర రావు,ఉమ్మడిశెట్టి బహదూర్ మరియు కార్పొరేటర్లు,ఇంచార్జిలు,క్లస్టర్ ఇంచార్జ్, వైసీపీ శ్రేణులు,మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.