-విద్యార్థులను అభినందించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
EMDP EXPO 2024 లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల విద్యార్థుల కోసం SCERT మరియు ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 25, 26 న ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ టూర్ నిర్వహించారు. ఈ యాత్రకు కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. యాత్రలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ (CPDM), IKP EDEN వంటి ఇంకుబేటర్లను సందర్శించారు. అలాగే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని అమెజాన్ ఆఫీసు మరియు Sheraton హోటల్లో కాన్ఫరెన్సులు నిర్వహించారు. ఈ యాత్రలో విద్యార్థులు యువ పారిశ్రామికవేత్తలతో సంభాషణలు, స్మార్ట్ మిషన్లు, రోబోట్స్ పరిశీలన ద్వారా ఆవిష్కరణ, పారిశ్రామికత పట్ల కొత్త అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెరుకులపాడు (కర్నూలు), జ్ఞానానికేతన్ హైస్కూల్ (విశాఖపట్నం), కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వీరనారాయణం (అనకాపల్లి) విద్యార్థులు, ఉపాధ్యాయులు చాముండేశ్వరి, సునీత కుమారి, సుజాత మరియు ఉద్యమ్ ప్రతినిధులు శ్యాం సూర్యనారాయణ, జయవర్థన్, బ్రహ్మం చాగంటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి, ఈఎండీపీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి అభినందనలు తెలిపారు.