అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన పింఛన్లను జులై 1 నుంచి ఇంటి వద్దే అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు సీఎస్ నీరభకుమార్ జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలిచ్చారు. జులై 1వ తేదీనే (సోమవారం) లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు. అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించింది. ఒక్కో ఉద్యోగి 50 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేలా చూడాలన్నారు. డబ్బులను ఈ నెల 29నే బ్యాంకుల నుంచి డ్రా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. పెరిగిన పింఛన్ల మేరకు 65,18,496 మందికి రూ.4,399.89 కోట్లు పంపిణీ చేయనున్నారు. వీరిలో 64.75 లక్షల మందికి ఇంటి వద్ద రూ.4,369.82 కోట్లు ఇంటి వద్ద అందిస్తారు. మిగిలిన 43 వేల మంది అంటే బయట చదువుకునే దివ్యాంగ్ విద్యార్థులకు రూ.30.05 కోట్లను డీబీటీ ద్వారా వారి అకౌంట్లలోకి జమ చేస్తారు. జులై 1 ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేశారు.
Tags amaravathi
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …