Breaking News

హస్టల్ లో చదివే ప్రతి విద్యార్థి మన బిడ్డే

-వారిని కంటికి రెప్పాలా చూసుకోవాలి
-చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అందరం కలిసి పనిచేద్దాం
-బిసి సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారులతో సమీక్ష సమావేశంలో జిల్లాల బిసి సంక్షేమ శాఖ అధికారులకు -బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన మీద నమ్మకంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ సంక్షేమ హస్టల్స్ లో వదులుతున్నారని వారిని తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని బిసి సంక్షేమ శాఖ హస్టల్ అధికారులకు బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో బిసి సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారులతో మంత్రి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్షేమ శాఖ హాస్టల్స్ పై విద్యార్థుల తల్లిదండ్రులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. అధికారులు బాగాపనిచేస్తున్నారు. అందుకే ప్రభుత్వ సంక్షేమ హస్టల్స్ కు బాగా డిమాండ్ పెరిగింది. అయితే కొన్ని చోట్ల హాస్టళ్ల నిర్వహణపై వస్తున్న పిర్యాదులను సరిచేసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టిక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల బారీన పడకుండా రెగ్యూలర్ గా మెడికల్ క్యాంప్ లు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంకోసం ట్యూటర్లను నియమించకోవడంతో పాటు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని సూచించారు. హాస్టల్ సంక్షేమ అధికారి కచ్చితంగా హెడ్ క్వార్టర్ లోనే నివాసం ఉంటూ హాస్టల్ ను పర్యవేక్షించాలని లేనిపక్షంలో చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. జిల్లా డిప్యూటి డైరెక్టర్ ఆకాస్మిక తనఖీలు చేపట్టాలని, ప్రతి నెల తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా గత ఏడాది డిసెంబర్ నుంచి కాస్మోటిక్ చార్జీలు, డైట్ చార్జీలు పెండింగ్ లో ఉన్న విషయం అధికారులు మంత్రిగారి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడి గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ప్రతి బిల్లును వీలైనంత త్వరగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా అధికారులు కలెక్టర్లతో సమన్వయంగా ఉంటూ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా హాస్టల్స్ లో సౌకర్యాలను మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.,
సమీక్ష సమావేశంలో పాల్గొన్నబిసి వెల్పేర్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అనంత్ రామ్, బిసి వెల్పేర్ డైరెక్టర్ కృష్ణమోహన్, అడిషనల్ డైరెక్టర్ చంద్ర శేఖర్ రాజు. 26 జిల్లాల బిసి సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *