Breaking News

165వ ఆదాయపు పన్ను దినోత్సవం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదాయపు పన్ను కార్యాలయం, SVR ప్లాజా, విజయవాడలో ఆదాయపు పన్ను శాఖ విజయవాడ 165వ ఆదాయపు పన్ను దినోత్సవాన్ని 24 జూలై, 2024న జరుపుకుంది. అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమైన “ది ఛైర్మన్ స్పీక్స్” ప్రీ-రికార్డ్ సంవాద్ సెషన్‌లో ఛైర్మన్, CBDT రవి అగర్వాల్ అభినందన సందేశం ప్రసారం చేయడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. తర్వాత పన్ను చెల్లింపుదారులు మరియు వాటాదారులను అభినందిస్తూ ఒక షార్ట్ మూవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఆదాయపు పన్ను శాఖ పిఆర్.కమీషనర్ సునీత బిల్లా అధికారులు మరియు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో ఆదాయపు పన్ను పాత్ర గురించి, భారతదేశంలో ఆదాయపు పన్ను పరిణామాన్ని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా డా. విశాల్ ఇండ్ల, MD,DNB (సైకియాట్రీ) గౌరవ అతిథిగా విచ్చేసి “స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్” అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఇంకా కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్(TDS) సాకా నరేష్, అదనపు ఆదాయపు పన్ను డైరెక్టర్ (ఇన్‌వి) వినోద్ కన్నన్, ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ సంధ్యా రాణి, ఆదాయపు పన్ను (టిడిఎస్) జూ. కమీషనర్ నెడుమారన్, జాయింట్ కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ అభినయ మరియు ఇతర అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *