Breaking News

అడ‌వుల విస్తీర్ణం పెంచండి

-రూ.13.5 కోట్ల‌తో జిల్లాలో సీడింగ్‌ కార్య‌క్ర‌మం
-అట‌వీశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి. అనంత‌రామ్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమ‌రావ‌తి: అడ‌వుల విస్తీర్ణం పెంపు దిశ‌గా జిల్లా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అట‌వీశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి. అనంత‌రామ్ కోరారు. స‌చివాల‌యంలో జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడుతూ అడ‌వుల విస్తీర్ణం పెంచాల్సిన ఆవ‌శ్య‌త‌క‌త గురించి వివ‌రించారు. గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంలో భాగంగా గ‌తంలో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం జ‌రిగేద‌ని, గ‌త నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఇది జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. ఇప్పుడు మ‌ళ్లీ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం పెద్ద ఎత్తున నిర్వ‌హించాల‌న్నారు. అలాగే వ‌నం-మ‌నం, నీరు చెట్టు, వ‌నం పిలుస్తోంది లాంటి కార్య‌క్ర‌మాలు పెద్ద ఎత్తున చేట్టాల‌న్నారు. రాష్ట్రంలో హ‌రిత ఛ‌త్రం (గ్రీన్ క‌వ‌ర్‌) విస్త‌రించ‌డానికి కావాల్సిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. అడ‌వులు పెంచే చ‌ర్య‌ల్లో భాగంగా రూ.13.5 కోట్ల‌తో విత్త‌నాలు వెద‌జ‌ల్లే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని, ప్ర‌తి జిల్లాలో 50 ల‌క్ష‌ల విత్త‌నాల సీడింగ్‌ ప‌నులు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌ను క‌లెక్ట‌ర్లు ప‌ర్య‌వేక్షించాల‌న్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *