Breaking News

అమ‌రావ‌తిలో జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌మావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఐదేళ్లలో తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలు, అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. సెప్టెంబర్ 20 నాటికి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతుందన్నారు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని, దానికి కమిటై ఉన్నామన్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానమన్నారు. పరదాలు కట్టడం, చెట్లు నరకడాలు ఉండ కూడదన్నారు ముఖ్యమంత్రి. అమ‌రావ‌తిలో నేడు జ‌రిగిన జిల్లాల క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, తాను అందర్నీ కంట్రోల్ చేస్తున్నానని అంటూ పరిపాలన అనేది సర్వీసు మూడ్‌లో ఉండాలని, అధికారాన్ని చెలాయించే పద్దతిలో ఉండడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు. ఇన్నాళ్ల మారిదిగా రాజకీయాలు లేవని, ఇప్పుడు మారాయని గుర్తు చేశారు. 1995 నాటి చంద్ర‌బాబును చూస్తార‌ని అంటున్నానని, మీరు ఇంకా ఆ స్పీడ్ రాలేదని చురకలు అంటించా రు ముఖ్యమంత్రి. త్వరలో ఆకస్మిక తనిఖీలకు తాను వస్తానని చెప్పకనే చెప్పారు. ఆనాడు.. మంత్రులు, అధికారులు ప‌రిగెత్తారు.. ప‌రిగెత్తించామన్నారు. మేం ప‌ని చేస్తామని, మీతో ప‌ని చేయిస్తామన్నారు. విజ‌న్ 2020ని ఆనాడు చాలామంది ఎగ‌తాళి చేశారని, ఇప్పుడు విజ‌న్ 2047 టార్గెట్ అని గుర్తుచేశారు.

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విష ప్రచారం చేస్తున్నవారికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 36 మందిని చంపేశారని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని దుయ్యబట్టారు. ఆ పేర్లు అడిగితే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో భట్టిప్రోలు వ్యవహా రాన్ని వివరించారు. ఇలాంటి విషయాలపై రైట్ టైమ్‌లో చెప్పకపోతే ఫేక్ వ్యక్తులు సోషల్‌మీడియా‌లో ఇష్టానుసారంగా బురద జల్లే అవకాశం ఉందన్నారు. ప్రతీ విషయాన్ని హ్యూమన్ యాంగిల్‌లో చూస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు సీఎం . వల్గర్ లాంగ్వేజ్ వాడడం, అధికారం ఉందని పెత్తందారిగా వ్యవహరించడం ఉండకూదన్నారు. ప్రతి నెలా ఒకటిన ‘పేదల సేవలో’ పేరుతో కొత్త కార్యక్రమం చేస్తున్నామన్నారు. మనందరం ప్రజల కష్టాలు తెలుసుకుని, పేదరికం లేని సమాజం కోసం పని చేయాలన్నారు.

”మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్‌ వన్‌గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కనబెట్టారు.. బ్లాక్‌ మెయిల్‌ చేశారు. బ్రాండ్‌ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది. ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే దిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారు. ఆ ప‌రిస్థితిని నుంచి అంద‌రు బ‌య‌ట‌ప‌డి కొత్త ద‌నంతో మెరుగైన ఫ‌లితాల‌ను అందించాలి” అని క‌లెక్ట‌ర్ల్ కు పిలుపు ఇచ్చారు.

ఇక ఈ స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్, ప‌లువురు మంత్రులు, వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *