Breaking News

పేదలకి సైతం ఆధునిక వైద్యసేవలు అందించాలి


-డాక్టర్లు ప్రాణదాతలతో సమానం… రోగిని ప్రేమతో ఆదరించాలి…
-చిరంజీవి హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
అందరికి ఆధునిక వైద్యం అందించాలని పిలుపునిచ్చారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. గురువారం నాడు కూకట్ పల్లి, జి హెచ్ ఎం సి పార్క్ ఎదురుగా ఏర్పాటు చేసిన చిరంజీవి హాస్పిటల్స్ (వాస్కులర్ మరియు మల్టీస్పెషలిటీ) ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ నేడు వైద్యం ఎంతో ఖరీదైనదని, పేదలకి సైతం ఆధునిక వైద్యసేవలు అందించాలని, డాక్టర్లు ప్రాణదాతలతో సమానమని, రోగిని ప్రేమతో ఆదరించాలని పిలుపునిచ్చారు. నేడు హైదరాబాద్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, ప్రపంచ పాఠం లోనే హైదరాబాద్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, విద్య, వైజ్ఞానిక, టెక్నాలజీ మరియు వైద్య రంగాలలో విశేషంగా పురోగమిస్తుందని డాక్టర్లను ప్రశంసించారు.

వాస్కులర్ వైద్యంలో దేశంలోనే తమ హాస్పిటల్ ఎంతో విశేషంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందని ఉప ముఖ్యమంత్రి పిలుపు మేరకు తమ వంతు పేదలకు సైతం ఆధునిక వైద్యసేవలు అందిస్తామని హాస్పిటల్ ఛైర్మన్, ప్రఖ్యాత వాస్కులర్ సర్జన్ డా. కె. సంజీవ రావు తెలిపారు. తమ హాస్పిటల్ నందు అన్ని రకాల అత్యాధునిక వైద్య సౌకర్యాలు, లేటెస్ట్ పరికరాలు, అంతర్జాతీయ క్యాత్ ల్యాబ్ ను ప్రవేశపెట్టామని, వాస్కులర్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు అన్నిటికి తమ వద్ద వైద్య సేవలు లభిస్తాయని, విదేశాలలో లభ్యమయ్యే లేజర్ చికిత్సలు తమ వద్ద అందుబాటులో లభిస్తాయని తెలిపారు.

చిరంజీవి హాస్పిటల్ నందు పూర్తి స్థాయి వైద్యసేవలు లభించటమే కాకుండా విశేష అనుభవం గడించిన నిపుణులచే జనరల్ మెడిసిన్, గైనకాలజి, ఆర్థోపెడిక్, జాయింట్ రిప్లేసెమెంట్స్ మరియు స్కిన్ మరియు కాస్మొటిక్ వైద్య సేవలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కిన్ స్పెషలిస్ట్ డా. శిల్ప పొన్నాడ, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డా. వంశి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రాజకీయ నాయకులు, సినిమా నటులు, దర్శకులు, వ్యాపారవేత్తలు, నగర ప్రముఖులు పాల్గొని డాక్టర్లకు అభినందనలు తెలిపారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *