విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రామలింగేశ్వర నగర్,రాణిగారితోట, కృష్ణలంక వరద బాధితులను ఆదుకునేందుకు వైసిపి నేతలు నడుం బిగించారు.తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 15,16,17 మరియు 18 డివిజన్లలో పాలు, వాటర్ పంపిణీ చేశారు.వైసిపి నేతలు మాట్లాడుతూ బాధితులకు తమ వంతు సహాయంగా ఈ సేవా కార్యక్రమం పెట్టినట్లు చెప్పారు.. వైసిపి హయాంలో వరద వచ్చిన ముందస్తు హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేసే వారిని కానీ టిడిపి హయాంలో ఎటువంటి సమాచారం లేకుండా నీరు వదలడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు అన్నారు..ఇక్కడ ప్రజలు ఇంకా ప్రాణాలతో జీవిస్తున్నారంటే దానికి కారణం మాజీ సీఎం జగన్, దేవినేని అవినాష్ ల చొరవతో కట్టిన రిటైనింగ్ వాల్ కారణమని చెప్పారు.. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైంది అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు నామమాత్రపు చర్యలు చేపట్టి పని చేయడం దారుణమన్నారు.. వైసిపి హయాంలో జరిగిన మంచి పనులను ప్రజలు ఇప్పటికి కూడా గుర్తుంచుకొని చెప్తున్నారని అన్నారు..వరదలను దృష్టిలో ఉంచుకొని తమ వంతు సహాయంగా దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు..వరద బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి అని డిమాండ్ చేసారు,బాధితులకు పూర్తి సహాయం అందెవరకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.ఈ పంపిణి కార్యక్రమంలో వైసీపీ నాయకులు వై.సిద్దార్థ , డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ,17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, వైసీపీ ముఖ్య న్యాయకులు,క్లస్టర్ ఇంచార్జ్ లు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …