ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 22, 23, 24 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు సూచించారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యుల సమావేశంలో సోమినాయుడు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తు ఉత్సవాల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం నుంచి బంగారు బోనం సమర్పణకు వచ్చే భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులకు బ్రాహ్మణ వీధిలోని ఉద్యోగుల కార్యాలయ ప్రాంగణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. మూడు రోజుల పాటు నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు దాతలు, రైతులు, వ్యాపార వర్గాల వారి నుంచి అవసరమైన కూరగాయలు, పండ్లు సేకరించేందుకు దేవస్థానం తరపున ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పక్షంలో కూరగాయలను దేవస్థానం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు శివప్రసాదశర్మ, శ్రీనివాసశాస్త్రి, పాలకమండలి సభ్యులు దుర్గాప్రసాద్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags indrakiladri
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …