మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పెడన శాసనసభ్యులు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత బుధవారం పలు శాఖల అధికారులతో సమీక్షించారు. పెడన మార్కెట్ యార్డ్ లో జులై 8 వ తేదీ (గురువారం ) జరగనున్న మహానేత డాక్టర్ వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని, రైతు దినోత్సవం పెడన మార్కెట్ యార్డులో ప్రారబోత్సవానికి సిద్ధం కానున్న డాక్టర్ వై.యస్.ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఈ సందర్భంగా పరిశీలించి గురువారం జరగబోయే పలు కార్యక్రమ వివరాలను తెలిపారు. ఉదయం 08:30 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి బందరు రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వై.ఎస్.ఆర్ పార్క్ ప్రారంభిస్తారు, అనంతరం బస్ స్టాండ్ దగ్గర ఉన్న మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. తర్వాత బంటుమిల్లి రోడ్డు సెంటర్లో భారీ కేక్ కటింగ్ కార్యక్రమం జరపనున్నారు.
ఉదయం 9:30 గంటలకు జయలక్ష్మి సొసైటీ రోడ్డులో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తోటమూల సెంటర్లో ఉన్న మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.. ఉదయం 10 గంటలకు పెడన మార్కెట్ యార్డులో జరుగు రాష్ట్ర స్థాయిలో జరగనున్న డాక్టర్ వైఎస్సార్ జయంతి మరియు రైతు దినోత్సవంలో భాగంగా ,మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన డాక్టర్ వై.ఎస్.ఆర్ అగ్రి టెస్టింగ్ లాబ్ ని రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ,కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), వెల్లంపల్లి శ్రీనివాసరావు ,జిల్లా కలెక్టర్ జె. నివాస్ గారు,జే.సీ. డాక్టర్ కె. మాధవిలత జిల్లా సహచర శాసనసభ్యులతో కలసి ప్రారంభించిన వెంటనే అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ అధికారులు, నియోజకవర్గంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పా ల్గొ న్నారు.
Tags machilipatnam
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …