Breaking News

వైయస్సార్ జయంతి-రైతు దినోత్సవం మహిళలచే కేక్ కట్ చేయించిన నాగిరెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి 72వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి సచివాలయం హౌస్ కీపింగ్ మహిళా ఉద్యోగులచే కేక్ కట్ చేయించి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధానిగా రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాలకు రూపకర్తైన చౌదరి చరణ్ సింగ్ జయంతి డిశంబరు 23వ తేదీన జాతీయ స్థాయి రైతు దినోత్సవంగా జరుపుకుంటుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం జూలై 8వతేదీన రాష్ట్ర రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి లక్ష కోట్ల రూ.ల వ్యయంతో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో జలయజ్ణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి లక్షలాది ఎకారాలకు నీరందించారని నాగిరెడ్డి ఈసందర్భంగా గుర్తు చేశారు.అదే విధంగా పేదవర్గాలకు 6లక్షల ఎకరాలను భూమిని పంపిణీ చేశారని చెప్పారు. అంతేగాక విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి ఆరోగ్యశ్రీ,ఫీజు రీఇంబర్సుమెంట్ వంటి అనేక పధకాలను ప్రవేశపెట్టి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలచారన్నారు.దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా పేదవర్గాల సంక్షేమానికి అనేక పధకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయారని పేర్కొన్నారు.రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పధకం నేడు దేశంలో 5రాష్ట్రాల్లో అనగా ఎపి,తెలంగాణా,తమిళనాడు,కర్నాటక, పంజాబ్ రాష్ట్రాల్లో అమలులో ఉందని చెప్పారు.రాజశేఖర్ రెడ్డి 5సంవత్సరాల 3నెలలు మాత్రమే సియంగా ఉన్నప్పటికీ సమాజంలోని అన్ని వర్గాల అభున్నతికి ముఖ్యంగా రైతాంగ సంక్షేమానికి అనేక విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని నాగిరెడ్డి ఈసందర్భంగా పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా.రాజశేఖర్ రెడ్డి తనయునిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సమాజంలోని అన్ని వర్గాల వారి అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి స్పష్టం చేశారు.ఈ రెండేళ్ళ కాలంలోనే రాష్ట్రంలోని రైతన్నలకు వివిధ పధకాల ద్వారా ఇప్పటి వరకూ 83వేల 102కోట్ల రూ.లతో లబ్ది కలిగించడం జరిగిందని పేర్కొన్నారు.7గంటలు పాటు ఇస్తున్న రైతుల ఉచిత విద్యుత్ పధకాన్ని 9గం.లకు పెంచి అదీ పగటివేళలోనే అందించడం జరుగుతోందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డా.రాజశేఖర్ రెడ్డి పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 30 వరకూ పధకాలు,కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందని నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ సభ్యులు జె.రామారావు పాల్గొన్నారు. అనంతరం సచివాలయం హౌస్ కీపింగ్ మహిళలకు మిఠాయిలు పంపిణీ చేశారు.

Check Also

కేంద్ర ప్ర‌భుత్వం రూ.1100 కోట్ల వ‌ర‌ద సాయాన్ని త్వ‌ర‌గా అందించాలి : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కేంద్ర హోం శాఖ‌ మంత్రి అమిత్ షా కు విజ్ఞ‌ప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *