విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో వాయు కాలుష్యాన్ని మరింత తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు జె. నివాస్ చెప్పారు. గురువారం స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో నగరంలో వాయుకాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అమలు కమిటి తొలిసమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమం ప్రగతితీరును తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, శాస్త్రవేత్త మహిమకు విజయవాడనగరంలో వాయుకాలుష్యాన్ని మరింత తగ్గించేందుకు తీసుకున్న చర్యలను కలెక్టరు జె.నివాస్ ఈసందర్భంగా వివరించారు. రానున్న నాలుగు సంవత్సరాల్లో నగరంలో వాయుకాలుష్య నియంత్రణకు అమలు చేసే కార్యాచరణపై సమీక్షించారు. రానున్న రెండు నెలల్లో ప్రత్యేక కార్యాచరణ ద్వారా నగరంలో వాయుకాలుష్యాన్ని మరింత తగ్గించే దిశగా పనులను ముమ్మరం చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన గ్రీనరీ, స్పింకర్స్, ఫౌంటైన్స్ ఏర్పాటు, రహదారుల మార్జిన్లు అభివృద్ధి పరుచుట, ఇంటెల్ జెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్, తదితర పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జాతీయ రహదారి నగరంగుండా వెళుతుండడం మూలంగా ఎక్కువగా భారీ, తదితర వాహనాల సంచారం మూలకంగా, ఓవర్ వంటి నిర్మాణాలు మూలంగా కొంతమేర వాయుకాలుష్యం ఉండవచ్చన్నారు. అయితే నగరం బయట బైపాస్ రోడ్డు నిర్మాణం, బెంజిసర్కిల్, ఫ్లై ఓవర్ నిర్మాణాలు పూర్తయితే నగరంలో మరింత వాయు కాలుష్యం తగ్గుతుందని వివరించారు. పెద్ద ఎత్తున ఎ లక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేదిశగా అవసరమైన ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నెడ్ క్యాప్ అధికారులకు సూచించారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో పియం – 10ను గణనీయంగా తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నామన్నారు. నగరంలో నాలుగు సిఏఏక్యూయం స్టేషన్లు ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాలను గుర్తించి పరికరాల ఏర్పాటుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకుంది. శీతాకాలం, వేసవికాలం రెండు సీజన్ లలో గాలినాణ్యత పర్యవేక్షించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగరంలో వాయుకాలుష్యాన్ని మరింత నియంత్రించేందుకు ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 31 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనరుకు కలెక్టరు సూచించారు. ఇందుకు సంబంధించిన పనులు రెండు నెలల కాలంలో పూర్తి చేసి ప్రగతి సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. ఈకార్యక్రమం విజయవంతంగా ముందుకు వెళ్లేందుకు రవాణా, విద్యుత్తు, పోలీస్, వ్యవసాయ, పరిశ్రమలు, నగరపాలక సంస్థ అధికారులతో కూడిన ఈకమిటీ అవసరమైన చర్యలు సమన్వయంతో కృషి చేయాలన్నారు.
నగరపాలక కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన కార్యాచరణ అమల్లో కోవిడ్, లోకల్ బాడీ ఏర్పాటు, తదితర అంశాల మూలంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు. అయితే ఈ నెల 15వ తేదీన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఇందుకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలపై ఆమోదం తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రెండు నెలల్లో ఇందుకు సంబంధించిన పనులు పురోగతిలోకి తీసుకెళ్తామన్నారు.
సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టరు యస్.యస్. శోభిక, కాలుష్య నియంత్రణా మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు యస్.యస్.యస్. మురళీ, నెడ్ క్యాప్ డియం జెవిఆర్. సత్యనారాయణ, వియంసి సిఇ యం. ప్రభాకరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు ఏ. సుధాకర్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టరు పి.మోహనరావు, రవాణా, తదితర శాఖాధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …