విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్ లోని నగరపాలక సంస్థకు చెందిన డిస్నీల్యాండ్ స్థలాన్ని గురువారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టరు జె. నివాస్, వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ లు సందర్శించారు.
హెల్త్ సిటీకోసం అవసరమైన స్థల సేకరణలో భాగంగా డిస్నీల్యాండ్ స్థలాన్ని వారు పరిశీలించారు. ఏమేరకు ఈస్టలం హెల్త్ సిటీ కోసం అనుకూలంగా ఉంటుందనే విషయం పై సంబంధిత అధికారులతో వారు చర్చించారు.
