అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన కుటుంబసభ్యులు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ 72వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంజలి ఘటించి నివాళులు అర్పించారు. సీఎం జగన్ తన సతీమణి వైఎస్ భారతతితో కలిసి వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ కోసం రూ.154 కోట్లు కేటాయించామని తెలిపారు. పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నామని, రూ.30 కోట్లతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
Tags AMARAVARTHI
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …